యాపిల్ త్వరలో ‘ఐఫోన్ 17’ను విడుదల చేయనుంది. అయితే ‘ఐఫోన్ 17’ 6.3-అంగుళాల స్క్రీన్ తో రావచ్చని తెలుస్తోంది.
ఇది జరిగితే ఈసారి ఐఫోన్ సిరీస్ బేస్ మోడల్ పెద్ద డిస్ప్లేతో వస్తుంది. ఈ అప్కమింగ్ ఐఫోన్ సిరీస్ లో ‘ఐఫోన్ 17’, ‘ఐఫోన్ 17 ప్రో’, ‘ఐఫోన్ 17 ప్రో మాక్స్’ మోడళ్లతో పాటు కొత్త మోడల్ ను కూడా లాంఛ్ చేసే అవకాశం ఉంది. దీన్ని ‘ఐఫోన్ 17 ఎయిర్’ లేదా ‘ఐఫోన్ 17 స్లిమ్’ అనే పేరుతో తీసుకురావచ్చు.