ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
మేషం
మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. మిత్రుల సహకారం ఉంటుంది. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ఆర్థిక యోగం శుభప్రదం. శ్రీసుబ్రహ్మణ్య స్తోత్రం చదవడం శుభదాయకం.
వృషభం
మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ శ్లోకం చదవాలి.
మిధునం
పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదిత్య హృదయం చదవాలి.
కర్కాటకం
స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. నవగ్రహ స్తోత్రం చదవడం శుభకరం.
సింహం
ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.
కన్య
మీ మీ రంగాల్లో పెద్దల నుంచి మన్ననలు పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ధన,ధాన్య,వృద్ధి, సన్మానం, సుఖం, విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన శ్రేయస్కరం.
తుల
మానసిక ప్రశాంతత కోల్పోకుండా చూసుకోవాలి. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక నియంత్రణ అవసరం. విష్ణు సహస్రనామ పారాయణతో మంచి జరుగుతుంది.
వృశ్చికం
భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో శుభఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కళ్యాణవృష్టి స్తవం చదివితే బాగుంటుంది.
ధనుస్సు
పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది.
మకరం
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సుసౌఖ్యం, ధైర్యం, శరీరబలం, కీర్తి, భోజన సౌఖ్యం లభిస్తాయి. శ్రీదుర్గా ఆరాధన శుభకరం.
కుంభం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీఆంజనేయ దర్శనం శుభప్రదం.
మీనం
మనఃస్సౌఖ్యం ఉంది. మీ మీ రంగాల్లో మంచిపేరు సంపాదిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. శివారాధన శుభప్రదం.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)