ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

మేషం

ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. బుద్ధిబలంతో చేసే పనులు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీలక్ష్మీద్యానం శుభప్రదం.

వృషభం

చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.

మిధునం

సంతోషకరమైన వార్తలు వింటారు. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజన సౌఖ్యం ఉంది. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

కర్కాటకం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో ఓర్పు, సహనం, పట్టుదల అవసరం. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. ఇష్టదేవతా ఆరాధన శక్తిని ఇస్తుంది.

సింహం

తోటివారి సహకారంతో ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మంచి ఫలితాలను ఇస్తుంది.

కన్య

బాధ్యతలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శ్రీదుర్గాదేవి ఆరాధన శక్తిని ఇస్తుంది.

తుల

అనుకూల కాలం. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.

వృశ్చికం

పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగండి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

ధనుస్సు

ఓర్పుతో ముందుకు సాగాలి. మాట పట్టింపులకు పోకండి. మొహమాటం వల్ల లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోకండి. ఎవరినీ అతిగా నమ్మకండి. శ్రీసుబ్రహ్మణ్యస్వామి స్తోత్రం చదివితే మంచిది.

మకరం

చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల అంతా మంచే జరుగుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర విషయాలతో సమయాన్ని వృథా కానీయకండి. నవగ్రహ ధ్యానం శుభప్రదం..

కుంభం

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

మీనం

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఒక వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)