ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

మేషం

ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

వృషభం

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు అందుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శుభకరం.

మిధునం

వృత్తిపరంగా అనుకూలత ఉంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవప్రార్ధన శుభప్రదం.

కర్కాటకం

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయసహకారాలు మేలుచేస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శన శక్తినిస్తుంది.

సింహం

పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యానశ్లోకం చదివితే మంచిది.

కన్య

ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య కార్యక్రమంలో బంధుమిత్రులను కలుపుకొనిపోవడం మేలు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

తుల

శుభ భవిష్యత్తు కనిపిస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.

వృశ్చికం

మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. చంచలబుద్దితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.

మకరం

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

కుంభం

శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలు ఉన్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.

మీనం

ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం చదవాలి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)