ఫేక్ మున్సిపల్ కమిషనర్ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని దర్గామిట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

కడప జిల్లా బి.కోడూరుకు చెందిన నాగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ గా అవతారమెత్తి… వ్యాపారులకు ఫోన్ చేసి బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేసేవాడు. గతనెల 17న నిందితుడు నెల్లూరుకు చెందిన వ్యక్తికి ఫోన్చేసి డబ్బు పంపించమన్నాడు.

మోసపోయినట్లు గుర్తించిన వ్యక్తి ఫిర్యాదు మేరకు నాగేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ రోశయ్య వెల్లడించారు.