ఆర్థిక లావాదేవీల ధృవీకరణ కోసం కొన్ని సంస్థలు ఇప్పటికీ వినియోగదారుల గొంతు (వాయిస్ ప్రింట్)ను ప్రామాణికంగా తీసుకోవడంపై ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

కృత్రిమ మేధస్సు (AI) సాయంతో గొంతును సులభంగా అనుకరించడం సాధ్యమవుతుందని, ఇది మోసాలకు దారితీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. వాయిస్ గుర్తింపు ఆధారిత భద్రతా విధానాలు ఇకపై సురక్షితం కాదని ఆల్ట్మన్ అభిప్రాయపడ్డారు.