సంఘటనలు

1935: గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు.

1958: మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమయ్యాయి.

2022: నీరజ్ చోప్రా, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 88.13 మీటర్ల త్రోతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

జననాలు

1927:ఉత్పల సత్యనారాయణచార్య , తెలుగు కవి,రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత (మ.2007).

1928: కేశూభాయి పటేల్, గుజరాత్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు.

1936: మొదలి నాగభూషణశర్మ, నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు.

1953: శ్రీవిద్య , భారతీయ చలనచిత్ర నటి, గాయని(మ.2006)

1975: విజయ్ ఆంటోనీ , సంగీత,దర్శకుడు,గాయకుడు, నటుడు, నిర్మాత.

1976: కల్వకుంట్ల తారక రామారావు, సిరిసిల్ల శాసనసభ సభ్యుడు, మంత్రి.

మరణాలు

1862: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

1899: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (జ.1803)

1970: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు (జ.1890)

1971: గుర్రం జాషువా, తెలుగు కవి (జ.1895).

2000: ద్వారం భావనారాయణ రావు, వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు కుమారుడు (జ.1924)

2014: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య విమర్శకుడు, భాషా శాస్త్రవేత్త (జ.1934)

2018: నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (జ.1935)

2022: రెడ్డి రాఘవయ్య, బాల సాహిత్యవేత్త (జ. 1940)

పండుగలు, జాతీయ దినాలు

జాతీయ ధర్మల్ ఇంజినీర్ దినోత్సవం.

ఆదాయపు పన్ను దినం .

quotes