స్వీట్ కార్న్ (Sweet Corn) ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ఆహార పదార్థం. ఇది కేవలం రుచికరమైనదే కాకుండా అనేక పోషక విలువలతో నిండి ఉంటుంది.
దీని వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు ఇవే:
◼️ ఐరన్ మరియు ఫోలేట్ ఎక్కువగా ఉంటుండి. ఇది రక్తహీనత (అనిమియా) నివారణకు సహాయపడుతుంది.
◼️ దీనిలో ఫైబర్ అధికంగా ఉండి జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
◼️ శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి క్యాన్సర్‌కు ప్రతిఘటిస్తుంది.
◼️ మంచి కొవ్వులు ఉండడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గి హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
◼️ దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి.
◼️ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వలన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
◼️ విటమిన్ A, E ఉండడం వల్ల గ్లో ఉన్న చర్మం, ఆరోగ్యవంతమైన జుట్టు ఉంటుంది.
◼️ లూటిన్, జీక్సాంటిన్ వంటి పోషకాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
◼️ ఫోలేట్ అధికంగా ఉండడం వల్ల భ్రూణ అభివృద్ధికి సహకరిస్తుంది.
◼️ స్వీట్ కార్న్‌లోని నేచురల్ షుగర్లు రక్తంలో మెల్లగా విడుదల అవుతాయి.
