విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసం అమ్మవారి సారె మహోత్సవం పరిసమాప్తమైంది. గురువారం సాయంత్రం వరకు భక్తులు సారె సమర్పించేందుకు దేవస్థానం అధికారులు అవకాశం కల్పించారు.
అమావాస్య, ఆషాఢమాసం చివరిరోజు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, పండితులు కుటుంబ సమేతంగా అమ్మవారికి సారె సమర్పించారు.
అమ్మవారికి సుమారు రూ.4లక్షల విలువ చేసే ఆభరణాన్ని ఆలయ పండితుల తరఫున కానుకగా అందజేశారు.
