✍️దుర్గా ప్రసాద్

ఛత్తీస్గఢ్ లో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్, సుక్మా, బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో కలిపి మొత్తం 51 మంది ఆయుధాలు వీడినట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా తగ్గుతున్నట్లు ఆయన తెలిపారు.

2024 నుంచి ఇప్పటివరకు బీజాపుర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లలో 185 మంది హతమయ్యారన్నారని ఐజీ సుందర్రాజ్ తెలిపారు.