ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. నవీ ముంబై, థానేలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రహదారులు జలమయం అయ్యాయి.

ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరారు. ఇక నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.