భారత్ – బ్రిటన్ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్వాగతించారు.
ఇరుదేశాలు చేసుకున్న ఈ ఒప్పందం భారత ఆర్థికవ్యవస్థలోని బహుళ రంగాల అభివృద్ధికి సహాయపడుతుందని తెలిపారు. ఇతర దేశాలతోనూ భారత్ ఇటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. అనేక దేశాలు కలిసి పనిచేసే విధానం తగ్గిపోతున్న నేపథ్యంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఆయా దేశాల ఆర్థికవ్యవస్థకు మేలు చేకూరుస్తాయని అభిప్రాయం వ్యక్తంచేశారు.
