ఎండు చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రిస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు త్వరగా తగ్గుతాయి. అయితే, ఎండు చేపలను ఎక్కువగా తినడం వల్ల కొందరికి అలర్జీలు వచ్చే అవకాశముంది.