రోజుకు ఏడు వేల అడుగులు నడవడం ద్వారా ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతుందని లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన ఒక కథనం వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా 1.6 లక్షల మందికి పైగా పాల్గొన్న 57 అధ్యయనాల ఆధారంగా ఈ విషయం స్పష్టమైందని కథనంలో రాసుకొచ్చింది.
రోజుకు కేవలం 2 వేల అడుగులు నడిచే వారితో పోలిస్తే, 7 వేల అడుగులు నడిచే వారికి మరణ ప్రమాదం 47 శాతం వరకు తగ్గుతుందని కథనంలో వెల్లడించింది.
