మిరియాలు శరీరంలో మెటబాలిజంను పెంచి, కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో పైపెరిన్ గుణాలు అధిక బరువును తగ్గించడంలో తోడ్పడుతుందని వివరించారు. అంతేకాకుండా మిరియాలు అనేవి శరీరంలో కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుందని తెలిపారు. నల్లమిరియాలు సైనస్, ఉబ్బసం, ముక్కు సమస్యలను నయం చేస్తుందని, ఇది క్యాన్సర్, గుండె, కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని వెల్లడించారు.