ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ చనిపోయారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రశాంతి గురువారం రాత్రి ఆమె ప్రియుడు వాసు ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.

80% కాలిన గాయాలతో ఆమె తిరుపతిలో రుయా ఆసుపత్రిలో చేరారు. ఈక్రమంలో ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటన వాసు మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో జరిగినట్లు సమాచారం.