భారీ వర్షాలకు కలకత్తా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది.
ట్యాక్సీ వేలపై నీరు నిలిచింది. ఉత్తర కలకత్తా లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మహమ్మద్ అలీ పార్క్, భాజపా కార్యాలయం, సెంట్రల్ అవెన్యూ ప్రాంతాల్లో రోడ్లపై వాన నీరు నిలిచిపోయింది. మున్సిపల్ సిబ్బంది మోటర్లతో రోడ్లపై నీటిని తొలగిస్తున్నారు.
