భారత్ తమకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని, మిత్ర దేశమని మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు కొనియాడారు.

ఆ దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“సుదీర్ఘకాలంగా మాల్దీవులకు భారత్ సన్నిహిత, విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోంది. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతోంది. సంక్షోభాల సమయంలోనైనా మా ద్వీప దేశానికి భారత్ అండగా నిలిచింది”అని ముయిజ్జు ప్రశంసించారు.