స్మార్ట్ఫోన్ ల తయారీలో దూసుకెళ్తున్న భారత్ – అమెరికన్ ల చేతిలో మన ఫోన్లు…
స్మార్ట్ఫోన్ ల తయారీలో భారత్ దూసుకెళుతోంది. పీఎస్ఐ స్కీమ్ కారణంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది భారత్. అమెరికాలోనూ నేడు ఇండియా ఫోన్లు పెద్దఎత్తున దర్శనమిస్తున్నాయి.
ఈ ఏడాది తొలి 5నెలలో ఆ దేశ స్మార్ట్ఫోన్ ల దిగుమతుల్లో మన వాటా 36 శాతానికి చేరింది. అదే సమయంలో 82 శాతంగా ఉన్న చైనా మార్కెట్ వాటా 49 శాతానికి తగ్గింది. ఆ మేర డ్రాగన్ ఆధిపత్యానికి గండి పడింది.
