నటుడు విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. ” గత రెండు, మూడేళ్లుగా నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు. కుటుంబంతో కలిసి సమయాన్ని గడపలేదు. గర్ల్ఫ్రెండ్ కు సమయాన్ని కేటాయించలేదు. కానీ ఇప్పుడు పద్ధతి మార్చుకున్నాను. నా వాళ్ల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాను” అని తెలిపారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా విజయ్ చెప్పిన గర్ల్ఫ్రెండ్ ఎవరంటూ మరోసారి చర్చ మొదలైంది.
