మానవత్వం ఓ వ్యక్తిని జైలు పాలు చేసి.. కుటుంబానికి తిండి పెట్టలేని పరిస్థితి తీసుకువచ్చింది.

వివరాల్లోకి వెళ్ళితే…

భోపాల్ కు చెందిన రాజేశ్ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. గతేడాది పొరుగింటి మహిళ అనారోగ్యానికి గురవటంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చగా చనిపోయింది.

పోలీసు ల విచారణంలో రాజేశ్ బెరుకుగా సమాధానం చెప్పటం, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పోస్టుమార్టం రిపోర్టులో గొంతుకోసినట్లు వచ్చింది. దీంతో 13 నెలలు జైలు శిక్ష అనుభవించాడు.