జమ్ముకశ్మీర్ లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్ముకశ్మీర్, హిమాచలప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక రోడ్లు మూసుకుపోయాయి.

ఈ నేపథ్యంలో పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.