భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్ మనమరాలు (కుమార్తెకు కుమార్తె) గాయత్రి, శ్రీహర్ష ల వివాహ నిశ్చితార్థ వేడుకల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని ఆశీర్వదించారు.కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లి లోని మధువన్ ఫంక్షన్ హాల్ లో విశ్వరూప ధియేటర్ ప్రక్కన బుధవారం జరిగిన కార్యక్రమాల్లో కొత్వాల పాల్గొని కంచర్ల కు వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో మధువన్ నాగేశ్వరరావు, జెవిఎస్ చౌదరి, భోగా శ్రీనివాస్, కొత్వాల ఉమామహేశ్వరరావు, ఉండేటి శాంతి వర్ధన్, అలెక్స్ తదితరులు పాల్గొన్నారు.
