భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
✍️దుర్గా ప్రసాద్
అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మౌళిక వసతులు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
బుధవారం పాల్వంచ మండలం పరిధి జగన్నాధపురం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం పీసా గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికీ అవసరమైన నీరు,రోడ్డు, డ్రైన్లు విద్యుత్, వైద్యం వంటి మౌళిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.
A-4 మద్యం షాపు నిర్వహణకు ఆమోదం పీసా గ్రామసభలో జగన్నాధపురం లోని A-4 మధ్యం షాపు నిర్వహణకు గ్రామస్తులు ఆమోదం తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దమ్మ గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ B నారాయణ, పంచాయతీ కార్యదర్శి చెన్నకేశవరావు, పీసా కమిటీ సభ్యులు ధర్మసోత్ రమేష్, బానోత్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, మాజీ జడ్పిటిసి మాలోత్ నందా నాయక్, కాంగ్రెస్ నాయకులు కొండం పుల్లయ్య, బండ్లపల్లి వెంకట నారాయణ, కందుకూరి రాము, పైడిపల్లి మహేష్, ఉండేటి శాంతి వర్ధన్, అలెక్స్, ధర్మసోత్ సేవియా, బానోతు బాలాజీ నాయక్, మలోత్ లోక్య,బాబు రావు, వెంకటేష్, చింటూ, బిచ్చ తదితరులు పాల్గొన్నారు.
