అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేయనుంది. నేటి సాయంత్రం షార్ కేంద్రం నుంచి ລ້ 2-16 (GSLV-16) ప్రయోగంతో ‘నైసర్’ (NISAR) ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించనుంది.
దీంతో భూ ఉపరితలాన్ని చిత్రీకరించడంలో భారత్ చాలా ముఖ్యమైన దశకు చేరినట్లవుతుంది. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో – నాసాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంతరిక్షంలో ఇప్పటివరకు చేర్చిన అత్యంతశక్తిమంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లలో ఒకటిగా ఇది నిలవనుంది.
