భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
31-07-2025
✍️దుర్గా ప్రసాద్

ఆర్ మధుసూదన్ రెడ్డి, షేక్ యాకుబ్ షావలి, ధర్నాలో పాల్గొని మాట్లాడిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు…

ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా – టియుసిఐ రాష్ట్ర మహాసభ పిలుపులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పాల్వంచ లోని నవభారత్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ మధుసూదన్ రెడ్డి, షేక్ యాకుబ్ షావలి, పాల్గొని మాట్లాడుతూ కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, పోరాడుతూఉంటే, ఓపక్క ప్రభుత్వాలు 8 గంటల పనిని రద్దుచేసి, 282 జీవోను తెచ్చి పది గంటలు పని చేయాలని హుకుం జారీ చేస్తున్నారు.
కార్మికులు, ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు ఒక్క కలం పోటుతో లక్షల రూపాయల జీతాన్ని తీసుకుంటా ఉన్నారు. ఈ ప్రజా ప్రతినిధులు దిగిపోతే 50 వేల రూపాయల ఫించిని తీసుకుంటా ఉన్నారు. ఒక కార్మికుడు 35 సంవత్సరాలు రెక్కలు ముక్కలుగా పని చేసుకుని సంస్థలకు లాభాలు తెస్తే, కార్మికుడు దిగిపోతే, వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు.

ఇదెక్కడి న్యాయం కార్మికుడు దిగిపోతే కనీస పెన్షన్ 9, వేల రూపాయలు, సామాజిక భద్రతను కల్పించాలి పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ ను, విరమించుకొని రాష్ట్ర అసెంబ్లీలో లేబర్ కోడ్స్ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానించి కార్మికులపై తమ చిత్తశుద్ధిని, నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

మున్సిపల్ గ్రామపంచాయతీ మిషన్ భగీరథ కేజీబీవీ మోడల్ స్కూల్స్ యూనివర్సిటీలోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సి నివేదిక ప్రకారం మినిమం బేసిక్ ను నిర్ణయించాలి హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నాం.
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫిక్స్డ్ టర్మ్ విధానాన్ని రద్దు చేయాలి వెంటనే రెగ్యులరైజ్ చేయాలి, ప్రభుత్వ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలలో సిబ్బందికి అర్హత కనుగుణంగా వేతనాలు కేటగిరీ వారీగా వేతనాలు చెల్లించాలి.

భవన & ఇతర నిర్మాణ రంగ కార్మికులకు పథకాలు పెంచాలి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కార్మికులకు అప్పగించడాన్ని విరమించుకోవాలి. మున్సిపల్ గ్రామపంచాయతీ హాస్పిటల్స్ మధ్యాహ్న భోజన కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి పెండింగ్ బిల్లులను తక్షణమే మంజూరు చేయాలి.
ఆటో & మోటర్ హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డులో ఏర్పాటు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 వేలు ఇస్తానన్న హామీని తక్షణమే అమలు చేయాలి.

సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిలిపివేయాలి. మన బొగ్గు నాణ్యతతో పెంచి ఓపెన్ మార్కెట్ చేయాలి. కేజీబీవీ మోడల్ స్కూల్స్ నాన్ టీచింగ్ సిబ్బందికి పని భారాన్ని తగ్గించాలి వీక్లీ ఆఫ్ లు అమలు చేయాలి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని డిపిఓ గారికి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నూపా భాస్కర్ ఉపాధ్యక్షులు గోనెల రమేష్ వై గోపాలరావు పాల్గొని మాట్లాడారు. టియుసిఐ జిల్లా నాయకులు, మల్లెల వెంకటేశ్వర్లు, యం రాజశేఖర్, వేల్పుల రమేష్, బి మల్సూర్, వేముల గురునాథం మిట్టపల్లి రాజేందర్, జానయ్యా, బత్తుల వెంకటేశ్వర్లు, కే వీరన్న మల్లెల రామయ్య, శ్రీహరి, కుంజా భాస్కర్ బొల్లి రవి రాణి, కొత్తపల్లి రఘు, సదా వెంకటేశ్వర్లు, భాజ్య శీను, మోటం సంపత్, ఉమా, బాలు, బండారు లక్ష్మి మీన స్వప్న రఫీ సంజీవ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు

గోనెల రమేష్
ఉపాధ్యక్షులు
షేక్ యాకుబ్ షావలి
కార్యదర్శి
TUCI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ, పాల్వంచ