భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
రైతులు మునగ, ఆయిల్ ఫామ్, పత్తిలో అంతర పంటగా మునగ మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసి అధిక లాభాలు పొందాలని, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్,రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
చుంచుపల్లి మండలం పరిధిలోని ప్రశాంతి నగర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన సంపూర్ణత అభియాన్ సమరోహ్ ఆకాంక్ష మేల కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఏ డి ఏ యు.నరసింహారావు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశం లో కొత్వాల మాట్లాడుతూ…
రైతులందరూ నేరుగా వెదజల్లే వరి విధానాన్ని అవలంబించాలని నానో యూరియా వాడాలన్నారు. రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టే విధానాలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి బాబురావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, ఆత్మ డి పి డి సరిత, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త భరత్, ఏ డి ఏ యు. నరసింహారావు, డివిజన్ కు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు శంభో శంకర్, రాకేష్, రాజేశ్వరి, కరుణ, నర్మదా, దీపక్ ఆనంద్, పాల్వంచ, జూలూరుపాడు సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి చుంచుపల్లి, కొత్తగూడెం మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
