చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి (ఆగస్టు 1) నుంచే ఉచిత విద్యుత్ అమలుకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.125 కోట్లు ఖర్చు చేయనుంది.
