IT నియామకాలపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో క్యాప్ జెమినీ ఇండియా ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది.
భారత్ లో ఈ ఏడాది 40,000 – 45,000 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది.
ఇందులో 35-40 శాతం లేటరల్ నియామకాలు ఉంటాయని క్యాప్ జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశ్విన్ యార్డీ తెలిపారు. ఈ కొత్త నియామకాలు అభ్యర్థుల కృత్రిమ మేధ ఆధారిత సామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు.
