భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాత పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
ఆదిదేవుడు విగ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలనీ, అందరికీ శుభం జరగాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
పాత పాల్వంచ గడియకట్టలోని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల పనులు ప్రారంభం సందర్భంగా ఆదివారం కర్రపూజ జరిపారు.
ఈ కార్యక్రమంలో కొత్వాల అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఏ పనైనా ప్రారంభానికి ముందు గణేష్ పూజ చేస్తే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మంచి జరుగుతుందన్నారు. నిర్వాహకులు గణపతి ఉత్సవాలను నియమనిష్టలతో జరిపి దైవ కృపకు పాత్రులు కావాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో గడియకట్ట పెద్దలు B శేషగిరిరావు, B పాపారావు, A భాస్కర్, V రమేష్, M శరత్, R మల్లేష్, A వెంకట్రావు, వినయ్, K బాబురావు, P నాసరయ్య, తోపాటు ఉత్సవ కమిటీ సభ్యులు G వెంకటేశ్వర్లు, B అన్వేష్, G ప్రవీణ్, B సాగర్, K నాగరాజు, B ప్రశాంత్, P బాలాజీ, K రఘు, B జగన్, B బాలా, R శంకర్ రెడ్డి, M రమేష్, మరియు కాలనీ మహిళలు, భక్తులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి….
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం






