భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
బూర్గంపాడు మండల
✍️దుర్గా ప్రసాద్

సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సొసైటీ ఆఫీస్ ని సందర్శించడం జరిగింది. రైతులకి ఎరువు కట్టలు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారు.

సొసైటీ ఆఫీసులో ఇసుక వేస్తే కింద రాలకుండా ఉండేవిధంగా రైతులు ఎరువుల కోసం ఎగబడుతున్న పరిస్థితి
చూడండి. రైతులు దేశానికి
వెన్ని ముక్క దేశానికి అన్నం పెట్టే రైతన్న అని గొప్పగా చెబుతుంటారు.

కానీ ప్రభుత్వాలు ఎరువు కట్టలు రైతులకి అందించలేని పరిస్థితి దిగజారిపోయింది
గత నెలలో ఎరువులు రైతులకి అందట్లేదని ప్రభుత్వానికి తెలియజేస్తే అధికార పార్టీ కార్యకర్తలు అదేం లేదు బ్రహ్మాండంగా ఎరువులు అందిస్తున్నామని గొప్పగా చెప్పారు
ప్రశ్నించారు మరి ఇప్పుడు చూడండి.

కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులకు ఎటువంటి లోటు లేకుండా రైతులకు ఎరువులు అందిస్తున్నామని గోడంలలో ఎరువు కట్టలు మూలుగు తున్నాయి అని చెప్పారు.

ఇదేనా చూడండి… ఇంత దారుణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎరువు కట్టల కోసం ఈసమస్య తీవ్రంగా ఉంది.

ఈ రోజున అధికారులను అడిగితే సమాధానం ఇలా ఉంది… ఈరోజున సొసైటీ అధికారులని ఏంటి పరిస్థితి ఎందుకు రైతులని ఇబ్బందులు పడుతున్నారు అని అడిగితే మేమేం చేయలేము అని చెప్పిన అధికారులు రానప్పుడు మేమేం చేయాలి మా దగ్గర ఉన్న యూరియా కట్టలు వాటిని రెండు కట్టలు చొప్పున లేదా ఒక కట్టేన రైతులకు ఇచ్చి పంపుతాం తప్ప అంతకంటే మేమేం
ఏమి చేయాలి అని చేతులు ఎత్తేసిన సొసైటీ అధికారులు అందుకోసమే సిపిఎం పార్టీ వెంటనే రైతులకి యూరియా కొరత లేకుండా అందించాలని డిమాండ్ చేశారు.

ఈ మధ్యకాలంలో వర్షాలు పడుతున్నాయి ఓరిపిస్తుంది వర్షం నీళ్లు లేక రైతులు ఆకాశం కెళ్ళి ఎదురుచూశారు. కానీ వర్షం కురిసి ఒరిపిస్తుందని యూరియా కట్టలు లేకపోవడం రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని రైతులకు ఎరువులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు తెలిపారు.

error: -