✍️దుర్గా ప్రసాద్

సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులకు సత్వర వైద్య సేవల కోసం ఏర్పాటు

సింగరేణి భవన్, ఆగస్టు 12, 2025
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గల అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రిలో సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సౌకర్యం కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక డెస్క్ ను సింగరేణి సీఎండీ శ్రీ ఎన్. బలరామ్, అపోలో ఆసుపత్రుల జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి మంగళవారం ప్రారంభించారు.

అలాగే కొత్తగా నిర్మించిన ఏసీ ఆసుపత్రి విభాగాన్ని కూడా వారు ప్రారంభించారు.
సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఏదైనా అనారోగ్య సమస్యతో ఈ ఆసుపత్రిని సందర్శించినప్పుడు వెనువెంటనే పేరు నమోదు చేసుకొని సంబంధిత వైద్య నిపుణుల వద్దకు వైద్య సేవ ల కోసం పంపించడానికి, ఈ ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేశామనీ, దీనివల్ల ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సత్వరమే వైద్య సేవలు పొందే అవకాశం ఏర్పడుతుందని ఆసుపత్రి యాజమాన్యం వారు వివరించారు.

సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంపై సంస్థ ఛైర్మన్ సంతోషం ప్రకటించారు. ఇక్కడికి రిఫర్ చేయబడిన ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇంకా డీన్ డాక్టర్. మనోహర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ రెడ్డి, సింగరేణి డిప్యూటీ సీఎంఓ శ్రీ కె. బాలకోటయ్య, అపోలో ఆసుపత్రి అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అబ్దుల్ వేజ్ పాల్గొన్నారు.

error: -