భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
బూర్గంపాడు మండలం
✍️దుర్గా ప్రసాద్
రానున్న మూడు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు…
తప్పని పరిస్థితుల్లో సహాయం కోసం స్థానిక పోలీసులతో సంప్రదింపులో ఉండాలి…
పల్లపు ప్రాంతాల ప్రజలు.. తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలు లేదా కాజ్‌వేలను దాటకూడదు…
అత్యవసరమైతే డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలు పొందండి…
బూర్గంపాడు ఎస్ఐ మేడా ప్రసాద్…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజుల్లో ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన బూర్గంపాడు మండలంలో గోదావరినది, వాగులు, వంకలు, చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.
కావున కాలి నడకన, వాహనాలలో ప్రయాణించే ప్రజలు జలమయమైన రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సూచించారు.
అత్యుత్సాహంతో.. సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు.
గోదావరి నది, వాగులు, వంకల వద్దకు జాలర్లు, ప్రజలు చేపల వేటకు వెళ్ళకూడదని సూచించారు.
మండలంలో గిరిజన గ్రామాల ప్రజలు పశువులను కాపరులు, రైతులు నదులు, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకూడదని, పరిసర ప్రాంతాల దగ్గరకు కూడా వెళ్లకూడదని సూచించారు.
సాధ్యమైనంత వరకు అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన సమయాలలో బయటకు రాకుండా ఉండడానికి ప్రయత్నించవలసిందిగా సూచించారు.
ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న ప్రాంతాలలో భద్రతా దృష్ట్యా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేసారు.
వరదల్లో చిక్కుకుని ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి పోలీస్ శాఖ తరపున 24×7 అందుబాటులో సేవలందిస్తామని అన్నారు.
ప్రజలు ఎవరైనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం అందించి పోలీసు వారి సేవలను పొందాలని కోరారు.
ప్రమాదాలు వాటిల్లకుండా పోలీసు వారు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా బూర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
అత్యవసర సమయాల్లో క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు..
8712682055 @ SHO బూర్గంపాడు.
8712682056 @ పోలీస్ స్టేషన్ బూర్గంపాడు.
ఇవి కూడా చదవండి …
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
