మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:13 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణములోని కాల్టెక్స్ రైల్వే బ్రిడ్జి నుండి కన్నాల బ్రిడ్జి వరకు రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిషన్ మోర్చా ప్రతినిధులు డిమాండ్ చేశారు.

బుధవారం పాత జీఎం ఆఫీసు క్రాస్ రోడ్డు దుస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు మాట్లాడారు. గుంతల మయమైన రహదారి నిర్మాణం జరిగే వరకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు ప్యాచ్ వర్క్ చేపించాలన్నారు.

బెల్లంపల్లి పట్టణoలోని రైల్వే స్టేషన్ ఫ్లై ఓవర్ నుండి మొదలుకొని కన్నాల ఫ్లైఓవర్ వరకు కొత్త రోడ్డు నిర్మించాలన్నారు. చౌడేశ్వరి, ఏఎంసీ, గాంధీ విగ్రహం, కన్నాల బ్రిడ్జి వరకు రోడ్డు గుంతలు పడ్డాయన్నారు. వర్షం పడితే గుంతలో నీరు చేరి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని వాపోయారు. తూతూ మంత్రంగా గుంతలను పూడ్చడం కాకుండా శాశ్వత రోడ్డు నిర్మాణం చేయించాలని డిమాండ్ చేశారు.

దీనికి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్, స్థానిక మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ వెంటనే చొరవ తీసుకొని రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. లేనిపక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో చేసే ఆందోళన కార్యక్రమాలకు అధికారులు బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు.

ఈ యొక్క కార్యక్రమంలో జేఏసీ నాయకులు టి.మని రామ్ సింగ్, ఎం.డి.చాంద్ పాషా, అంబాల మహేందర్, గోగర్ల శంకర్,వేల్పుల శంకర్, దాసరి కుమార్,దుగుట రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

error: -