రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సత్తా చాటాలి… — రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్

కొత్తగూడెంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న కొత్వాల…

త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు ZPTC MPTC సర్పంచ్ ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేసి, తమ సత్తా చాటాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

కొత్తగూడెం పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో బుధవారం రాత్రి వరకు జరిగిన జిల్లా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ పై చర్చించారు.

ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య అధ్యక్షత వహించగా, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ కార్యనిర్వాహకులు, రాష్ట్ర కోఆర్డినేటర్ గంటా వినయ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ…

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని, కాంగ్రెస్ కార్యకర్తలు మారుమూల గ్రామాల్లో సైతం పర్యటించి, కాంగ్రెస్ అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ కొత్వాల అన్నారు.

ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.

error: -