మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేది:14 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: గురువారం కన్నాల ఎర్ర కుంట చెరువును సందర్శించి పరిశీలించిన సంయుక్త కిసాన్ మోర్చా – సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు, వృధాగా పోతున్న వేల క్యూసెక్కుల నీటి పై ఆరా తీశారు. ఎర్ర కుంట చెరువును వెంటనే పునరుద్ధరించాలని సంయుక్త కిసాన్ మోర్చా – సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కన్నాల చెరువు కింద భూములకు సాగునీరు అందించే, మత్స్యకారులకు చేపల పెంపకం ఉపాధినిచ్చే చెరువును, గీతా కార్మికులకు ఉపాధినిచ్చే తాడి చెట్లను, సైతం గతంలోనే కూకటి వేళ్లతో తీసివేశారు. దీనిపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే నామమాత్రపు జరిమానాలు విధించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. తిరుమల హిల్స్ రియల్ ఎస్టేట్ కబ్జా కోరుల నుండి ఎర్ర కుంట చెరువును కాపాడాలని డిమాండ్ చేసారు.
కన్నాల ఎర్ర కుంట చెరువుకు పైన సుబ్బారావు తోటలో మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్లాట్ల బిజినెస్ నడుస్తుందని, దీంట్లో కూడా ఒక చెరువు ఉందని దాన్ని కూడా గండి కొట్టారని అన్నారు. ఇవి రెండు కూడా లింకు చెరువులు కరోనా కాలంలోనే అవకాశాన్ని అదునుగా చేసుకొని చెరువు కట్టకు గండి కొట్టిన దుండగులపై ఉన్నత స్థాయిలో న్యాయ విచారణ చేపట్టాలని, వారిని కఠినంగా శిక్షించాలని ఇరిగేషన్,రెవెన్యూ,బెల్లంపల్లి సబ్ కలెక్టర్,జిల్లా కలెక్టర్ లకు విజ్ఞప్తి చేసారు.
పురాతన చెరువైన ఎర్ర కుంట చెరువును గతం నుండి బడా వ్యాపారికి అనుకూలంగా క్రమంగా కుదిస్తూ చెరువు విస్తీర్ణాన్ని తగ్గించిన లంచగొండి అధికారులు. ఆ ప్రాంత బడా వ్యాపారికి అనుకూలంగా రికార్డులు తయారు చేయించుకొని ఎర్ర కుంట చెరువును కబ్జాకు గురి చేశారు. ఇప్పుడు తిరుమల హిల్స్ యజమాన్యం ఏకంగా చెరువుకు గండి కొట్టడం ద్వారా నది భూగర్భంలోనే ఇండ్లు నిర్మించుకుంటూ, ఎఫ్టీఎల్ లెవెల్ లో ఫ్లాట్లు విక్రయిస్తున్నారు.
ముంపుకు గురి కాకుండా ఉండడానికి ఏకంగా చెరువుకే గండి కొట్టి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తున్న దీనిపై కన్నాల లక్ష్మీపూర్ ప్రజలు మాజీ సర్పంచు ఫిర్యాదు చేసినప్పటికీ దున్నపోతుపై వాన పడ్డట్టుగా స్పందించకుండా ఉంటున్నారు.
అంటే అధికారులు రియల్ ఎస్టేట్ యజమాన్యాలు ఎంత ములాఖాత్ అయ్యారనేది అర్థం చేసుకోవచ్చన్నారు, అప్పటి బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే డి.ఎం.ఎఫ్.ఎల్.టి ప్రభుత్వ నిధులతో ఏకంగా ఈ వెంచర్లోకి రోడ్డు వేయించడం దానికి బలం చేకూర్చున్నది. తమకేది బాధ్యత లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న వీరికి సహకరించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
బెల్లంపల్లి శాసనసభ్యులు ఈ ఎర్ర కుంట చెరువు ఆక్రమణపై సమగ్ర విచారణకు ఆదేశించి సంబంధిత అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరారు. లేనిపక్షంలో కన్నాల, లక్ష్మీపూర్,మత్స్యకారులు, గీత కార్మికులతో చేపట్టే ఆందోళన పోరాటాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు MD ఎండీ.చాంద్ పాషా, తెలుగు దేశం పార్టీ పట్టణ అధ్యక్షులు, మనీ రామ్ సింగ్, నాయకులు గోగర్ల శంకర్, సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ అంబాల మహేందర్, టీడీపీ పట్టణ నాయకులు బొల్లు మల్లయ్య,శంకర్,వేల్పుల శంకర్,దాసరి కుమార్,దుగుట రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
