భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్‌ను సన్మానించిన నాయకులు.
కార్యాలయంలో కళాకారుల దేశభక్తి, జానపద గీతాల ఆలాపన.
పాల్వంచ: నేతాజీ యువజన సంఘం 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాల్వంచ పట్టణ పరిధి వనమా కాలనీలోని ఆ సంఘం కార్యాలయంలో నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి నివాళులర్పించి, కేక్ కటింగ్ చేశారు.

ఈ సందర్భంగా సమాజానికి ఎస్.జె.కె. అహ్మద్ చేస్తున్న సేవలను అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్, యూత్ కాంగ్రెస్ పాల్వంచ పట్టణ ఉపాధ్యక్షుడు భార్గవ్ సాయి, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎం.డి. మంజూరు, తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు ఆయనను ఘనంగా సన్మానించారు. నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ నేతృత్వంలో మరెన్నో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఎస్.జె.కె. అహ్మద్ మాట్లాడుతూ… “సమాజానికి సేవ చేయడమే కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కూడా చాలా అవసరం అని అన్నారు. సమాజసేవతో పాటు ప్రజలకు చట్టాలపై పూర్తిగా అవగాహన కల్పించడానికి కూడా నేతాజీ యువజన సంఘం కృషి చేస్తోందన్నారు. పేద విద్యార్థులకు అండగా ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపట్టాం. కరోనా సమయంలో కూడా శానిటైజర్లు, మాస్కులు అందజేసి, కరోనాపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాం అని తెలిపారు.
ప్రస్తుతం యువకులకు క్రీడా స్ఫూర్తి, దేశభక్తి పెంపొందిస్తున్నాం. నేతాజీ యువజన సంఘం ద్వారా సేవా కార్యక్రమాలు మునుముందు ఇలానే కొనసాగిస్తూనే ఉంటాం” అని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం జరిగిన దేశభక్తి గీతాల ఆలాపన కార్యక్రమంలో సినీ జానపద గాయకులు పెద్దిపాక విజయ్, న్యూ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ ఖాసిం, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ బాషా తమ పాటలతో అందరిని అలరించి ప్రశంసలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో సయ్యద్ అక్బర్, అబ్దుల్ రజాక్, అబ్దుల్ రావూఫ్, ఎం. సంతోష్, పి.రమేష్, ఉబ్బెన శ్రీను, ఓలపల్లి రాంబాబు, సక్కుబాయి, విజయ, ప్రవళిక, హరి సాయిరాం, చిమ్మి నాయుడు, బవ్ సింగ్, ఎం.డి. ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
