మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:14 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: వాతావరణ శాఖ ద్వారా రాబోయే 24 గంటలలో అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ వారు పలు సూచనలు చేశారు.

వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్ల వద్దని, వాగులు, నాలాలు దాటుతున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని, అలాగే శిథిలావస్థలో ఉన్న భావనల కింద ఉండరాదని, రోడ్డు ప్రక్కన తడిచి ఉన్న విద్యుత్తు స్తంభాలను ముట్టరాదని, వర్షం కారణంగా బురదమయమైన రోడ్లపై ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున వాహనాలు నెమ్మదిగా నడపాలని తెలిపారు. వార్డ్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు,ప్రజలను అప్రమత్తం చెయ్యాలని కోరారు.

error: -