మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:14 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
కాంట్రాక్టర్ బస్తీలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్….
బెల్లంపల్లి: పట్టణంలోని 18 వ వార్డు కాంట్రాక్టర్ బస్తీలో గురువారం మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ సందర్శించారు.
బస్తీ ప్రజలు దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న పారిశ్యుద్ధత, డ్రైనేజీ, మురికి కాలువల సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వార్డ్ సమస్యల పరిష్కారం కొరకు ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా నిధులు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి సైన్యం జాతీయ ప్రధాన కార్యదర్శి కొలిపాక శ్రీనివాస్ వినతి పత్రం సమర్పించారు.
బస్తీ ప్రజల సమస్యలను కళ్ళారా వీక్షించిన కమిషనర్ సానుకూలంగా స్పందించినట్టు కలిపాక శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుంకే తిరుపతి, మచ్చ చిరంజీవి, ఆడెపు రవి కుమార్, వోడ్నాలా మనోహర్, సామల రాజేశ్వరి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
