ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

మేషం

శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

వృషభం

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి, మంచి జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.

మిధునం

ఇష్టకార్యసిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకున్నది సాధిస్తారు. అధికారులు నుంచి సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శివారాధన చేస్తే మంచిది.

కర్కాటకం

ప్రారంభించబోయే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

సింహం

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు అధికం అవుతాయి. హుషారుగా పనిచేయాలి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారమార్గం దొరుకుతుంది. సూర్యాష్టకం చదవడం శుభప్రదం.

కన్య

ఉద్యోగంలో ఉన్నతస్థితికి చేరుతారు. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శివారాధన శక్తిని ఇస్తుంది.

తుల

మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.

వృశ్చికం

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనల వల్ల నిరుత్సాహం, విచారం, కలుగుతాయి. శత్రువుల జోలికి పోరాదు. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.

ధనుస్సు

మీ శ్రమ ఫలిస్తుంది. అనవసర విషయాలను సాగదీయకండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. గోవింద నామాలు జపిస్తే మంచిది.

మకరం

మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్నది సాధిస్తారు. విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. దైవబలం కాపాడుతోంది. శ్రీవిష్ణు ఆరాధన శుభప్రదం.

కుంభం

అదృష్టం వరిస్తుంది. ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.

మీనం

ప్రారంభించబోయే పనుల్లో లాభాలు ఉన్నాయి. ఆర్థిక సంబంధ విషయాల్లో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

quotes
error: -