మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 15 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: 79 వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైల్వే పరిధిలో ఉత్తమ విధులు నిర్వహించిన జి.ఆర్.పి.పోలీసులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఏ. లక్ష్మారెడ్డి జి.ఆర్.పి. హెడ్ కానిస్టేబుల్ రైల్వే పోలీస్ సేవలో ఉత్తమ విధులు నిర్వహించినందుకు గాను రైల్వే ఎస్.పీ.చందన దీప్తి చేతుల మీదుగా ఉత్తమ పోలీసు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్.పీ. గారు ఆయనను అభినందించారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… ప్రశంసా పత్రము రావడం చాలా గర్వంగా ఉందని, దీనితో తమపై మరింత బాధ్యతలు పెరిగాయని అన్నారు. విది నిర్వహణలో అతన్ని ప్రోత్సహించిన రైల్వే పోలీసు అధికారులకు, ఎస్పీ కు ధన్యవాదాలు తెలిపారు.

error: -