మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:15 ఆగస్టు 2025,
బిజెపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ జవాన్ ను సన్మానించిన కొయ్యల ఏమాజి
బెల్లంపల్లి: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పట్టణంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాంజీ గోండు ఆవాసంలో విద్యార్థులకు స్వీట్లు,పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం ఇటీవల ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన సువర్ణను శాలువాతో ఘనంగా సన్మానించారు. తదుపరి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని చైనా బార్డర్ లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న బి.పృథ్వీరాజ్, ఆయన సతీమణిను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి మాట్లాడుతూ…
ఆయన దేశం కోసం చేస్తున్న త్యాగాలను కొనియాడారు. తన కుటుంబ సభ్యులను వదిలి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రక్తం గడ్డ కట్టే చలిలో సైతం విధులు నిర్వహిస్తూ దేశాన్ని కాపాడుతూ మనల్ని రక్షించడం చాలా గొప్ప విషయం అన్నారు. అనేక మంది త్యాగ ధనుల వల్ల వచ్చిన స్వాతంత్ర్యాన్ని కాపాడుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ జవాన్లకు రుణపడి ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, జిల్లా కార్యదర్శి గోవర్ధన్, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాజులాల్ యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రావణ్, మహిళా మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు శీతల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
