మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:15 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శుక్రవారం ఉదయం 79వ భారత స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ప్రిన్సిపల్ కాంపల్లి శంకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్యం కోసం కృషిచేసిన మహనీయుల చిత్రపటాలకు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పూలమాలలు వేశారు. దేశ సేవలో వారి భాగస్వామ్యాన్ని కొనియాడారు.

అలాంటి మహనీయుల బాటలో మనమందరం నడిచి స్వాతంత్ర ఫలాలను పొందాలని సూచించారు. విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపాల్ మేడ తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

error: -