గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
16/8/2028
సారపాక
✍️దుర్గా ప్రసాద్

సిపిఎం పార్టీ సారపాక శాఖ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…

సారపాక పట్టణంలో బస్టాండ్ సెంటర్లో మరుగుదొడ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మహిళలు చాలా దారుణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలిపారు.

గ్రామ పంచాయతీ దొడ్లు కట్టించాలని దానికి సంబంధించిన స్థలాన్ని బూర్గంపాడు తాసిల్దార్ గారు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

భూముల్ని కబ్జాలు చేసే దౌర్భాగ్యం సారపాకలో ఉంది కానీ సారపాక సెంటర్ లో మరుగుదొడ్లు కట్టటానికి తలం దొరకాక పోవడం చాలా బాధాకరమైన విషయం సిగ్గుచేటు అని అన్నారు.

అధికారులు గానీ ప్రభుత్వం గానీ వెంటనే ఈ సమస్యని పరిష్కరించాలని తెలిపారు.
శ్రీరాంపురం గ్రామంలో డ్రైనేజీ రోడ్లు అక్కడ మిషన్ భగీరథ పైపులు ఇంటింటికి నల్లాలు లేవని తెలిపారు. వారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మిషన్ భగీరథ నీళ్లు ఎట్లా ఉంటాయో చూడలేదని ఆ పరిస్థితి

కొంతమంది వాటర్ ట్యాంక్ని కట్టకుండా ఆపి నందుకు అది షాక్ గా చూపించి ఆ గ్రామానికి మంచినీళ్లు అందించ ట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్కడ రోడ్లు సరిగా లేవని డ్రైనేజీలు సైడ్ కాలవలు వెంటనే చేపించాలని ఆ ప్రాంతాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆ ఏరియా కి వెళ్లి పరిశీలన చేసి ఆ ప్రాంతానికి మంచినీళ్లు రోడ్లు డ్రైనేజీలు సమస్య లేకుండా తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో కందుకూరి నాగేశ్వరావు, CH రమణయ్య, బోళ్ళు ధర్మా, కన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

error: -