భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బూర్గంపాడు మండలం
ముసలమడుగు గ్రామపంచాయతీ
✍️దుర్గా ప్రసాద్

బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని సింగారం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోయిన స్లాబ్ ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు ఉందని అంటున్నారు.

ఈ పాఠశాల భవనం గత 40 సంవత్సరాల క్రితం నిర్వహించినది ప్రస్తుతం ఈ పాఠశాలలో 35 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఇద్దరు టీచర్లు ఉన్నారు.

పాఠశాల శిథిలావస్థకు చేరిందని గత సంవత్సరం క్రితం నుండి స్థానిక ప్రజాప్రతినిధులకు నియోజకవర్గ ఎమ్మెల్యేకు మరియు ఐటిసి ఉన్నతాధికారులకు గ్రామస్తులు తరఫున విన్నవించుకొని ఉన్నారు.

అయినను వారి నుండి ఎటువంటి స్పందన రాలేదని వాపోయిన గిరిజన గ్రామస్తులు విద్యార్థులు లేకపోవడం వలన తమ పిల్లల ప్రాణాలు కాపాడుకో కలిగామని అన్నారు.

విద్యార్థులు ఉన్న సమయంలో కుప్పకూలినట్లయితే 35 మంది విద్యార్థినీ విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేటి అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారిన ప్రజా ప్రతినిధులు మారిన తమ గ్రామంలో ఉన్న పాఠశాల స్థితిగతులు మారలేదని వాపోతున్న గ్రామస్తులు.

ఇప్పటికైనా గిరిజనుల పట్ల దయవుంచి వెంటనే పాత భవనాన్ని కుల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించుటకు సంబంధిత అధికారులు మరియు ఐటిసి ఉన్నత అధికారులు ఐటిడి ఎ అధికారులు స్పందించి కృషి చేయాలని వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

error: -