రామగుండం పోలీస్ కమీషనరేట్
మంచిర్యాల జిల్లా,
తేది:19 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.
మంచిర్యాల జిల్లా: రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపనపల్లి వద్ద యూరియా ఎరువుల అక్రమ రవాణా నియంత్రణ కోసం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను గత కొద్ది రోజులుగా ఏర్పాటు చేసారు. ఉన్నతాధికారుల సందర్శనలో భాగంగా మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, చెక్ పోస్ట్ లో పోలీస్ సిబ్బందితో పాటు వ్యవసాయ,రెవెన్యూ శాఖల సిబ్బంది 24/7 నిరంతరం పగడ్బందీగా అప్రమత్తంగా ఉంటూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తూ యూరియా అక్రమ రవాణా చేసే వారిని పట్టుకోవాలని తెలిపారు. ఇట్టి చెక్ పోస్ట్ వద్ద గత రెండు రోజుల క్రితం యూరియాను అక్రమంగా తరలిస్తున్న వారిని పట్టుకొని ఓ కేసు కూడా నమోదు చేసారని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో వ్యవసాయ, పోలీస్, ఇతర శాఖల అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలను నియమించారని, అదేవిదంగా జిల్లా సరిహద్దు లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు 24×7 సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ తనిఖీ లు నిర్వహిస్తారని తెలిపారు.
ఎక్కడ కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచడం జరిగిందని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడుతుంది తెలిపారు. యూరియా,ఎరువులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు.
అనంతరం వాహనా తనిఖీ సమయంలో వివరాలు నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు వాహన తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వుంటూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. ఎరువుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా రవాణా చేస్తే కేసులు నమోదు చేయడబడతాయని హెచ్చరించారు.సీపీ వెంట జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సీఐ బన్సీలాల్,కోటపల్లి ఎస్సై రాజేందర్ ఇతర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి….
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
