మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:19 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
సామాజిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాగ్ల పంపిణీ..
మంచిర్యాల: సామాజిక్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం దోనబండలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నీలేష్ కాచ్వాల్ మాట్లాడుతూ…, సామాజిక్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు సరితా ఓఝా, సలహాదారు సురేష్ అగర్వాల్, ప్రేమా అగర్వాల్, ట్రస్ట్ సభ్యులు అనితా, కవితా కేడియా, జావిత్రి గెహ్లాట్, సరోజ్ అగర్వాల్, అంజలి పర్మార్, సంగీతా అగర్వాల్, హేమలత ఉపాధ్యాయ్ తమ పాఠశాల పిల్లలకు బ్యాగులను పంపిణీ చేశారని చెప్పారు.
గత 9 సంవత్సరాలుగా సామాజిక్ ట్రస్ట్ వివిధ సామాజిక సేవా పనులు చేస్తోందని సరితా ఓఝా తెలిపారు. సామూహిక వివాహాలు, వేసవిలో చల్లని నీరు అందించడం, పేదలకు రేషన్, బట్టల పంపిణీ మొదలైనవి ఎన్నో కార్యక్రమాలు చేశారని తెలిపారు.
దీనిలో భాగంగా మంగళవారం ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు బ్యాగులను పంపిణీ చేశారు. ట్రస్ట్ యొక్క ప్రధాన లక్ష్యం పేదలకు సహాయం చేయడం. ప్రిన్సిపాల్ నీలేష్ కచ్వాల్ ట్రస్ట్ సభ్యులందరికీ వారి మానవతా సేవకు కృతజ్ఞతలు తెలిపారు. సరితా ఓఝా, సురేష్ అగర్వాల్, ప్రేమ అగర్వాల్ లను పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నర్మద శిరీష,ప్రసన్న కుమారి, నహీద్,బాణాల లక్ష్మీనారాయణ,డి.సుధాకర్, కోల నాగరాజు, రెబ్బెన గోపాల్,బలిజపల్లి కిషన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు సోషల్ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కరతాలధ్వనులతో కృతజ్ఞతలు తెలిపి వీడ్కోలు పలికారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
