దేశంలోనే విలక్షణ నటుడు చిరంజీవి – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
దేశంలోనే విలక్షణమైన నటుడు చిరంజీవి అని తెలుగు ప్రజలు గర్వించదగిన వ్యక్తి అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఈనెల 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా బుధవారం పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు షేక్ ఖాసిం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో కొత్వాల ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ… చిరంజీవి ఆధ్వర్యంలో దేశంలో బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేసి లక్షలాదిమందికి ప్రాణదానం చేస్తున్న మెగా ఫ్యాన్స్ అభినందనీయులని అన్నారు. ఫ్యాన్స్ ఎప్పుడు సమాజ సేవలో ముందుండాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ మెగా ఫాన్స్ అధ్యక్షులు షేక్ ఖాసిం, జగదీష్, నాగరాజు, బ్రహ్మం, దేవ, రసూల్, రాము, శాంసన్, చంటి, లాల్ సింగ్, మాజీ జడ్పిటిసి ఎర్రం శెట్టి ముత్తయ్య, INTUC జిల్లా అధ్యక్షులు ఎస్ఎ జలీల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కాంగ్రెస్ నాయకులు కాపర్తి వెంకటాచారి, కందుకూరి రాము, ఉండేటి శాంతి వర్ధన్, షేక్ చాంద్ పాషా, డిష్ నాగేశ్వరరావు, అలెక్స్, వాసుమల్ల సుందర్రావు, కటుకూరి శేఖర్, వాసు మల్ల సోమయ్య, జి ప్రభాకర్, భోగినీ సందీప్, ఎర్రగుంట నరసింహారావు, పాతూరి రామమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
