కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,
ఆసిఫాబాద్,
తేదీ:20 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

ఆసిఫాబాద్: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రిని జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు టీయూడబ్ల్యూజే (ఐజేయు ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు , ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రిని జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు టీయూడబ్ల్యూజే (ఐజేయు ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.  

ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయు ) జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్, ఎస్ సంపత్ కుమార్ మాట్లాడుతూ…

జర్నలిస్టులు చాలీచాలని వేతనాలతో జీవితాలు గడుపుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారథిగా నిలుస్తూ సేవలందిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మంత్రిని కోరారు.

సానుకూలంగా స్పందించిన మంత్రి జిల్లాలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ ని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి ఎస్ వేణుగోపాల్, వారణాసి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు కృష్ణం రాజు, నగరారే తారు, అడప సతీష్, సురేష్ చారి, బిక్కజీ, టీడబ్ల్యూజేఏఫ్ అద్యక్షుడు సలీం బేగ్, జర్నలిస్టులు బాల శ్రీను, శ్రీధర్, మహేష్, రాధాకృష్ణా చారి, మిలిన్ , సురేష్ తదితరలు పాల్గొన్నారు.

error: -