మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:20 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది పాత నేరస్తులను బుధవారం రోజున స్థానిక తహసిల్దార్ ముందు బైండోవర్ చేయించారని బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై సీహెచ్.కిరణ్ కుమార్ తెలిపారు.

వారు మాట్లాడుతూ… గత ఏడాది వినాయక నిమజ్జనం సందర్భంగా గొడవలకు కారణమై కేసులు అయిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక ముందు మరొక గొడవలకు దిగా కుండా ఏంఆర్ఓ కృష్ణ ముందు బైండ్ ఓవర్ చేయించారు.

ఈ నెల చివరి మాసం లో గణేష్ ఉత్సవాలు ప్రారంభము నేపథ్యంలో వారికి ముందస్తు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి గొడవలకు పాల్పడకుండా శాంతి యుతంగా పండుగ వేడుకలను నిర్వహించుకోవాలని వారికి తెలిపారు.

పోలీసు శాఖ వారి సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని నిబంధనలు ఉల్లoగిoచిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని శాంతిభద్రతకు విఘాతం కలగాకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

error: -